: నీట్ ఎగ్జామ్.. మారిన క్వశ్చన్ పేపర్!
ఈ రోజు జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలో అపశ్రుతి చోటు చేసుకుంది. వరంగల్ లోని సెయింట్ పీటర్స్ కేంద్రంలో తెలుగు మీడియంలో నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు, ఇంగ్లీషు, హిందీ మీడియాలకు చెందిన పేపర్లు ఇచ్చారు. దీంతో, విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరీక్షా కేంద్రం ముందు బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను సముదాయించే యత్నం చేశారు.
వరంగల్ అర్బన్ ఆర్డీఓ వెంకటరెడ్డి ఈ విషయాన్ని సీబీఎస్ఈ కోఆర్డినేటర్ దృష్టికి తీసుకువెళ్లారు. రెండు రోజుల్లోగా సీబీఎస్ఈ అధికారులు నిర్ణయం చెబుతారని, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఆర్డీఓ పేర్కొన్నారు. కాగా, ఈ సంఘటనపై డీఎస్పీ మురళీధర్ నేతృత్వంలో విచారణ జరుపుతున్నారు.