: ఎన్టీఆర్ అనేది ఓ శక్తి: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
ఎన్టీఆర్ అనేది ఓ శక్తి అని ఆయన పెద్ద అల్లుడు డాక్టరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘టీడీపీలోకి రాక ముందు డాక్టర్ కోర్సు చదువుతుండేవాడిని. మద్రాసులో పీజీ చిల్ట్రన్స్ స్పెషలిస్టు కోర్సు చేస్తున్నాను. ఇంకో ఆరునెలల్లో ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తాననగా, టీడీపీని స్థాపించారు. 1982 మార్చి 29న అనుకోకుండా నేను హైదరాబాద్ లో ఉన్నాను. అప్పుడు.. పది రోజుల్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో సరైన వ్యక్తులు, సరంజామ కనపడలేదు.
నేను ఒక భావజాలంతో ఉన్న వ్యక్తిని, అందుకే, అక్కడే ఉండిపోయాను. ఎన్టీఆర్ అనేది ఓ శక్తి. ఆయన అప్పటికే నలభై ఐదు సంవత్సరాలకు పైగా సినీ రంగంలో ఉన్నారు. తమిళనాడులో ఎంజీఆర్ ను చూసి ఎన్టీరామారావు గారు రాజకీయ రంగంలోకి రావడానికి ఒక రకంగా స్ఫూర్తి అనుకోవచ్చు’ అని వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు.