: ‘యూట్యూబ్’ లో ఆ వీడియో నన్ను చాలా ఇబ్బంది పెట్టింది: సింగర్ సునీత


యూట్యూబ్ లో ఓ వీడియో తనను చాలా ఇబ్బంది పెట్టిందని ప్రముఖ గాయని సునీత చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘యూట్యూబ్ లో ఓ వీడియో ఇబ్బంది పెట్టింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అనిపించింది, కానీ, ఎంత మందిని రిస్ట్రిక్ట్ చేస్తామనిపించింది. ‘సునీత కూతుర్ని చూశారా! కత్తిలా ఉంది’ అనే టైటిల్ తో ఆ వీడియోను పోస్ట్ చేశారు. నా కూతురుని కామెంట్ చేయడానికి వాళ్లెవరు? నేను, నా పిల్లలు ఇద్దరూ ఉన్న ఫొటోను తీసుకుని, దానిని ఎడిట్ చేసి, మ్యూజిక్ యాడ్ చేసి ఈ వీడియోను పెట్టారు’ అని ఆమె మండిపడ్డారు.

  • Loading...

More Telugu News