: సూర్యాపేట ఎస్పీకి అరుదైన గౌరవం.. ఫిక్కీ అవార్డుకు ఎంపిక!


సూర్యాపేట జిల్లా ఎస్పీ పరిమళ హననూతన్ కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఫిక్కీ అవార్డుకు ఆమె ఎంపికైంది. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్ వర్కింగ్ సిస్టం (ఎఫ్ఐఎన్ఎస్) అప్లికేషన్ వినియోగానికి గానూ ఈ అవార్డు ఆమెను వరించింది. ఈ నెల 24 లేదా 25వ తేదీల్లో ఈ అవార్డును ఆమె అందుకోనున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఎఫ్ఐఎన్ఎస్ ప్రారంభించిన జిల్లా సూర్యాపేట. అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసి నిర్ధారించేందుకు ఈ అప్లికేషన్ ను వినియోగించారు. దీనిని విజయవంతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలోనే ఫిక్కీ అవార్డు ఆమెను వరించింది. ఈ సందర్భంగా పరిమిళ హననూతన్ మాట్లాడుతూ, జిల్లా పోలీసు సిబ్బందికి, సహకరిస్తున్న ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News