: కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలి: అజయ్ మాకెన్
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రూ.2 కోట్ల లంచాన్ని తీసుకున్నారని మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్ కూడా విమర్శలు గుప్పించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ పై ఆ పార్టీకి చెందిన నేతే స్వయంగా ఆరోపణలు చేయడాన్ని సీరియస్ గా పరిగణించి ఏసీబీ, సీీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.