: మోదీజీ!.. మా పెళ్లి జరిపించండి: ప్రధానికి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి లేఖ
'మోదీజీ!, మా పెళ్లి జరిపించండి' అంటూ ప్రధానికి ఓ ఇంజనీరింగ్ యువకుడు లేఖ రాసిన ఆసక్తికర సంఘటన ఇది. చండీగఢ్ కి చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి, అక్కడి ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న ఓ యువతిని ప్రేమించాడు. అయితే, రెండు వైపుల పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో, ఆవేదన చెందిన అతను, ఓ వ్యక్తిని పంపించి పెద్దలతో మట్లాడి, తమ పెళ్లి జరిపించేలా చూడాలని కోరుతూ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు ఓ లేఖ రాశాడు. ఈ సందర్భంగా పీఎంఓ అధికారులు మాట్లాడుతూ, తమ కార్యాలయానికి వచ్చే లేఖలలో అరవైశాతం ఈ తరహా లేఖలే ఉంటాయని, ఆ లేఖలను చదివినప్పుడు తమకు నవ్వొస్తూ ఉంటుందని చెప్పారు.