: ఒడిశా కేబినెట్ లో భారీ మార్పులు...పది మంది మంత్రులకు ఉద్వాసన!


ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ పదవి చేపట్టిన నాలుగేళ్లకు తొలిసారిగా తన కేబినెట్ ను విస్తరించారు. ఈ సందర్భంగా ఒడిశా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే సీఎం నవీన్ పట్నాయక్ తన మంత్రి వర్గంలో ఈ మార్పులు చేశారు. పది మంది మంత్రులకు ఉద్వాసన పలకగా, కొత్తగా పది మందికి స్థానం కల్పించడం జరిగింది. రాజ్ భవన్ లో గవర్నర్ ఎస్ సీ జమీర్ సమక్షంలో కొత్త మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. పది మందిలో ఆరుగురు మంత్రులుగా, నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, సిట్టింగ్ సహాయ మంత్రులు ప్రఫుల్ల మాలిక్, రమేశ్ చంద్రలకు కేబినెట్ మినిస్టర్లుగా పదోన్నతి లభించింది.

  • Loading...

More Telugu News