: చంద్రబాబు మరో విజయం... నవ్యాంధ్రకు వచ్చేందుకు డెల్ అంగీకారం


ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు అమెరికా పర్యటన మరింతగా విజయవంతమైంది. ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ డెల్ నవ్యాంధ్రకు వచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ప్రస్తుతం డల్లాస్ లో ఉన్న చంద్రబాబు డెల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు డెల్ సిద్ధంగా ఉందని ఆ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ సత్య స్పష్టం చేశారు.

అంతకుముందు డల్లాస్ లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన చంద్రబాబు, ఆపై హెలికాప్టర్ల తయారీ సంస్థ బెల్ డైరెక్టర్ చాద్ స్పార్క్ తో భేటీ అయ్యారు. ఏపీలో మాన్యుఫాక్చరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరగా, ఆయన పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆకర్షణీయమైన పౌరవిమానయాన విధానాన్ని తీసుకొచ్చామని, మరిన్ని వివరాల కోసం రాష్ట్రానికి రావాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News