: వెయ్యి కోట్ల మార్కును తాకాం... చరిత్ర సృష్టించాం: ఆర్కా మీడియా అధికారిక ప్రకటన


ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 వసూళ్లు రూ. 1000 కోట్ల మార్క్ ను తాకాయని చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో సోషల్ మీడియా ట్విట్టర్ లో సరికొత్త పోస్టర్ ను విడుదల చేస్తూ, 'భారతీయ సినిమా చరిత్రలో నంబర్ 1 బ్లాక్ బస్టర్' అని పేర్కొంటూ తాము చరిత్ర సృష్టించామని రూ. 1000 కోట్లు బాహుబలి వసూలు చేసిందని చెబుతూ, చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీలను ఉంచింది.

మరోపక్క బాహుబలి కలెక్షన్లపై కరణ్ జోహార్ సైతం ఇదే పోస్టర్ ను ట్వీట్ చేశాడు. ఇప్పటివరకూ సినిమా వసూలు చేసిన కలెక్షన్లపై పలు వార్తలు వచ్చినప్పటికీ, సినిమా తీసిన నిర్మాణ సంస్థ నుంచి కలెక్షన్లపై అధికారిక ప్రకటన కూడా వెలువడటంతో, బాహుబలి అభిమానుల ఆనందానికి అవధుల్లేవిప్పుడు.

  • Loading...

More Telugu News