: ఇక అధికారికం... తొలి రూ. 1000 కోట్ల చిత్రంగా బాహుబలి 2
మీరు చదివింది నిజమే. భారత చలనచిత్ర బాక్సాఫీసు రికార్డులన్నీ చిన్నబోయాయి. ఎస్ఎస్ రాజమౌళి తీసిన 'బాహుబలి-2' రూ. 1000 కోట్లు వసూలు చేసిన తొలి భారత చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇక ఈ వార్త అధికారికం. ఈ చిత్రం ఇండియాలో రూ. 800 కోట్లు, విదేశాల్లో రూ. 200 కోట్ల కలెక్షన్లను దాటేసిందని, ఈ ఘనత సాధించిన తొలి చిత్రం ఇదేనని ట్రేడ్ పండితుడు రమేష్ బాలా తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
With ₹ 800+ Cr in India and ₹ 200+ Cr in Overseas, #Baahubali2 becomes the 1st Indian movie to do ₹ 1000 Cr @ WW BO..