: రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథతో 'ఆరంభ్'


కలెక్షన్ల సునామీని సృష్టించడంలో బాహుబలి ఎంత వేగంగా పరుగులు పెడుతున్నదో అందరికీ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథను అందించింది ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్ లో హాలీవుడ్ సినిమాలతో బాహుబలి పోటీ పడగా, ఇప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ తో పోలిస్తే, మిన్నగా ఉండేలా ఓ భారీ ప్రాజెక్టుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ టీవీ సీరియల్ కు 'ఆరంభ్' అనే పేరు పెట్టుకున్న విజయేంద్ర ప్రసాద్, కథను తానే స్వయంగా అందిస్తున్నారు. ఈ సీరియల్ బాహుబలి స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటుందని తెలుస్తుండగా, పలు భాషల్లో స్టార్ నెట్ వర్క్ చానళ్లలో ప్రసారమవుతుంది. దేవసేన, వరుణ దేవ ప్రేమకథగా ఈ సీరియల్ ఉంటుందని, వరుణదేవగా రజనీష్ దుగ్గల్, దేవసేనగా హీరోయిన్ కార్తీక నటిస్తున్నారు. గోల్డీ బెహల్ దర్శకత్వంలో రానున్న ఈ సీరియల్ కోసం భారీ సెట్స్, విజువల్ గ్రాఫిక్స్ వాడుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News