: పాక్ కీలక నిర్ణయం... ముంబై - కరాచీ విమానాల రద్దు
ముంబై - కరాచీల మధ్య తిరిగే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. ఈ నిషేధం రేపటి నుంచి అమల్లోకి వస్తుందని, ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ డబ్బును వెనక్కు చెల్లిస్తామని పేర్కొంది. ఈ మేరకు పీఐఏ (పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్) ఓ ప్రకటన చేసింది. కాగా, భారత ఎయిర్ లైన్స్ సంస్థలు కరాచీ, ఇస్లామాబాద్ ప్రాంతాలకు నడిపే అంతర్జాతీయ సర్వీసులు మాత్రం కొనసాగనున్నాయి. ప్రస్తుతం న్యూఢిల్లీ, జైపూర్, ముంబై, అమృతసర్ విమానాశ్రయాల నుంచి పాక్ కు సర్వీసులు నడుస్తున్న సంగతి తెలిసిందే.