: నువ్వూ మీ నాన్నలా తయారవుతావా?: లోకేష్ కు కేంద్ర మంత్రి తోమర్ ప్రశ్న


విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం తరువాత జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ, ఓ ఆసక్తికర అంశాన్ని చెప్పారు. "నువ్వు కూడా మీ నాన్నలా తయారవుతావా ఏంటి?" అని కేంద్ర మంత్రి తోమర్ తనను ప్రశ్నించారని చెప్పారు. దీని వెనుక అసలు విషయాన్ని కూడా వెల్లడించారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తోమర్ కు ఫోన్ చేసినప్పుడు ఆయన ఈ ప్రశ్న సంధించారని చెప్పారు. ఇంతకీ ఎందుకలా అడిగారని ఆరా తీయగా, నిధుల కోసం తన తండ్రి కేంద్ర మంత్రులపై ఎంతో ఒత్తిడి తెచ్చేవారని తెలిసిందని, తాను కూడా అదే విధమైన స్ఫూర్తితో పని చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. అధికారంలో పదేళ్లున్న కాంగ్రెస్ పార్టీ గ్రామాల అభివృద్ధిని పక్కన బెట్టిందని లోకేష్ విమర్శించారు.

  • Loading...

More Telugu News