: భారత జలాల్లోకి ప్రవేశించిన చైనా నౌక.. తరిమికొట్టిన భారత్
చైనాకు చెందిన ఓ నౌక భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించింది. గుర్తించిన భారత తీరరక్షక దళం దానిని తరిమేసింది. శుక్రవారం రాత్రి తమిళనాడులోని తూత్తుకుడి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చైనా నౌకను గుర్తించిన తీర రక్షక దళం వెంటనే దాన్ని వెంటాడి భారత జలాల నుంచి తరిమికొట్టింది. వీహెచ్ఎఫ్ ద్వారా పంపిన హెచ్చరిక సంకేతాలకు చైనా నౌక స్పందించలేదని తీర రక్షక దళం అధికారులు తెలిపారు. భారత్లోకి ప్రవేశించింది యుద్ధ నౌక లేక వాణిజ్య నౌకా? అన్న విషయం తెలియరాలేదు.