: అప్పట్లో నేను ఎంత లావుగా ఉండేదాన్నంటే..: గుర్తు చేసుకున్న బ్రహ్మణి
తాను చిన్నప్పుడు చాలా లావుగా ఉండేదాన్నని మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి గుర్తు చేసుకున్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పుడు తాను చాలా లావుగా ఉండేదాన్నని, స్కూల్లో ఫ్రెండ్స్, టీచర్స్ తనను ఏడిపించేవారని అన్నారు. అయితే ఆటల్లో చురుగ్గా ఉండడం, జిమ్‌కు వెళ్లడం వల్ల బరువు తగ్గానని పేర్కొన్నారు. జిమ్‌కు వెళ్లేందుకు ఇప్పుడు సమయం దొరక్కున్నా ఫిట్‌నెస్ అన్నది మాత్రం తన జీవితంలో ఓ భాగమైపోయిందన్నారు. ఈ విషయంలో అత్తయ్య భువనేశ్వరి తనకు స్ఫూర్తి అని తెలిపారు. ఆమె కూడా చాలా లావుగా ఉండేవారని, ఏడాదిలోనే 60 కిలోలు తగ్గి స్లిమ్‌గా అయ్యారన్నారు. స్విమ్మింగ్, జాగింగ్‌లు ఒత్తిడి తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయన్నారు. తనకు తినడమంటే చాలా ఇష్టమని, రెస్టారెంట్లకు వెళ్లడమంటే మరీ ఇష్టమని బ్రహ్మణి తెలిపారు.