: అర్నాబ్ గోస్వామి కొత్త ఛానల్ ప్రారంభం.. తొలి రోజే లాలూకు షాక్!


అర్నాబ్ గోస్వామికి చెందిన కొత్త చానల్ 'రిపబ్లిక్ టీవీ' నేడు ప్రారంభమైంది. కార్యకలాపాలు మొదలైన తొలిరోజే అర్నాబ్ బాంబు పేల్చారు. బీహార్ లోని శివాన్ నియోజకవర్గం మాజీ ఎంపీ, నేరచరిత్ర వున్న షహబుద్దీన్ తిహార్ జైలులో వున్నప్పుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో మాట్లాడుతున్న ఆడియో టేప్ ను రిపబ్లిక్ టీవీ బట్టబయలు చేసింది. శివాన్ నియోజకవర్గంలో అల్లర్లు చెలరేగినప్పుడు పోలీసులు ఎలా ప్రవర్తించాలన్న అంశంపై ఈ క్లిప్ లో లాలూకు షహబుద్దీన్ సూచనలు ఇస్తున్నట్టు ఉంది.
 
దీంతో, లాలూపై వైరి పక్ష నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆయన తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఈ ఆడియో టేపు విని దేశం నివ్వెరపోయిందని అన్నారు. బీహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ స్పందిస్తూ, బీహార్ ప్రభుత్వాన్ని లాలూ, షాబుద్దీన్ కలసి ఎలా నడుపుతున్నారో దీనిని బట్టి అర్థమవుతోందని అన్నారు. అయితే, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాత్రం దీనిపై స్పందించడానికి అంగీకరించలేదు.    

  • Loading...

More Telugu News