: వారూ మనుషులే.. నిర్భయ దోషులకు ఉరిశిక్ష వేయడం కరెక్ట్‌ కాదు: మంచు లక్ష్మి


దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ నిర్భ‌య కేసులో నలుగురు దోషులకు కింది కోర్టులు విధించిన మరణశిక్షే సరైందని నిన్న‌ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీల‌క‌ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై స్పందించిన నిర్మాత‌, నటి, యాంక‌ర్ మంచు ల‌క్ష్మి నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష విధించడం కరెక్ట్‌ కాదని అన్నారు. దోషుల‌కు అమ్మాయిల విలువేంటో అర్థం అయ్యేలా చెప్పాలని అభిప్రాయ‌ప‌డ్డారు. వాళ్లు కూడా మనుషులే క‌దా అని అన్నారు. దోషుల‌కు త‌మ‌ తప్పు తెలుసుకునే అవకాశం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అస‌లు స్త్రీ విలువను బాల్యం నుంచే నేర్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.

  • Loading...

More Telugu News