: వరుసగా ఆరో రోజు... మరింత తగ్గిన బంగారం ధర!
గత ఐదు రోజులుగా నేల చూపులు చూస్తోన్న బంగారం ధరలు వరుసగా ఆరోరోజు కూడా అదే మార్గంలో పయనించాయి. ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర మరో రూ.125 తగ్గింది. దీంతో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,725గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు దేశీయ బంగారు వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మరోవైపు నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ తగ్గిపోవడంతో వెండికూడా ఈ రోజు మరో రూ.225 తగ్గి కేజీ వెండి ధర రూ.38,575గా నమోదైంది.