: ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
పార్కింగ్ చేస్తున్న సమయంలో ఓ విమానం వింగ్ ఏరోబ్రిడ్జ్‌కు తగిలిన ఘటన రాజస్థాన్‌లోని జయపుర విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం సంభవించలేదని, త్రుటిలో విమానం ప్రమాదం నుంచి బయటపడిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ విమానం ఈ రోజు ఉదయం డిల్లీ నుంచి జయపురకు చేరుకుందని, ఆ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.