: నాగచైతన్య కొత్త సినిమా టైటిల్ సాంగ్ అదుర్స్!


టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య న‌టిస్తోన్న కొత్త సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా టైటిల్ సాంగ్ ఈ రోజు విడుద‌లైంది. అక్కినేని నాగార్జున నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సినిమాను ద‌ర్శ‌కుడు కల్యాణ్ కృష్ణ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ స‌ర‌స‌న రకుల్‌ప్రీత్‌సింగ్ న‌టిస్తోంది. ‘బుగ్గ‌న చుక్క పెట్టుకుంది సీత‌మ్మ కంటి నిండ ఆశ‌ల‌తో...  రారండోయ్ వేడుక చూద్దాం’ అంటూ సాగుతున్న ఈ సినిమా పాట అభిమానుల‌తో అదుర్స్ అనిపిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు ఈ సినిమా యూనిట్ స‌న్నాహాలు చేసుకుంటోంది.


  • Loading...

More Telugu News