: చిన్నారులకు స్మార్ట్‌ఫోన్ ఇస్తే నష్టాలు కొని తెచ్చుకున్నట్లే!: పరిశోధనలో పలు చేదు నిజాలు
ఈ కాలంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం ఎంతగా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. కేవలం పెద్దవారు మాత్రమే కాదు.. ఇంట్లో చిన్నారులు కూడా స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లతో ఆడుకుంటున్నారు. అయితే, స్మార్ట్‌ఫోన్‌ల ప్రభావం చిన్నారులపై ఎలా ఉందనే అంశంపై టొరంటోలో 894 మంది చిన్నారులపై సుమారు నాలుగేళ్ల పాటు అధ్యయనం నిర్వహించిన ఓ సంస్థ పలు విషయాలను వెల్లడించింది.
స్మార్ట్ ఫోన్‌లతో సగటున రోజుకు 28 నిమిషాలు గడిపే చిన్నారులలో మాటలు రావడం ఆలస్యమవుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. తాము ఎనిమిది నెలల పసికందుల నుంచి రెండేళ్ల వయసున్న చిన్నారులపై పరిశోధన చేసి ఈ విషయాన్ని కనుగొన్నామని చెప్పారు. పిల్లలకు స్మార్ట్‌ఫోన్లతో పాటు టాబ్లెట్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవ్వడం వల్ల వారు ఆలస్యంగా మాటలు నేర్చుకుంటున్నారని తెలిపారు.