: 7.5 కోట్ల రూపాయల విలువైన 2 వేల రూపాయల కొత్త నోట్లు పట్టేశారు
ఉత్తరప్రదేశ్ లో భారీ మొత్తంలో 2000 రూపాయల నోట్లు పట్టుబడి కలకలం రేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని దలిగంజ్ క్రాసింగ్ వద్ద పాంటీ చద్ధా గ్రూప్ కు చెందిన రెండు కార్లలో సుమారు 7,50,00,000 రూపాయల మొత్తాన్ని 2000 నోట్ల రూపంలో తరలిస్తున్నారు. దీంతో అక్రమంగా భారీ ఎత్తున నగదు తరలిస్తున్నారని యూపీ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో యూపీ పోలీసులు ఆ రెండు కార్లను అడ్డగించి తనిఖీలు చేయగా, 7.5 కోట్ల విలువ చేసే 2000 రూపాయల కొత్త నోట్లు లభ్యమయ్యాయి. దీంతో కార్లోలోని ముగ్గురు వ్యక్తులతో పాటు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ ముగ్గురు నిందితులను విచారిస్తున్నారు. నగదు ఎవరిది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వంటి వివరాలు ఆరాతీస్తున్నారు.