: అమెరికాలో చంద్రబాబు బిజీబిజీ.. మరో మూడు సంస్థలతో ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు... అక్కడ వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎంటర్ ప్రెన్యూర్లతో ఆయన విందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, క్వాల్ కమ్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ గోపి సిరినేనితో ఆయన భేటీ అయ్యారు. టెలికమ్యూనికేషన్స్ రంగంలో క్వాల్ కమ్ బాగా పేరుగాంచింది. ఏపీలో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై క్వాల్ కమ్ ఆసక్తిని ప్రదర్శించింది. ఈ సమావేశం సందర్భంగా మరో మూడు ముఖ్యమైన ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం కుదుర్చుకుంది. ఐవీఎక్స్ సొల్యూషన్స్, ఇన్నోవా సొల్యూషన్స్, ఐబ్రిడ్జ్ సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది.