: తన రాజకీయ భవితవ్యంపై గాలి జనార్దన్ రెడ్డి ఏం చెప్పారంటే...!
అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ పై బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి రాజకీయల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఇదే విషయం గురించి మీడియా ఆయను ప్రశ్నించగా... బీజేపీ కోసం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని గాలి చెప్పారు. ఎన్నికల పట్ల తనకు ఆసక్తి లేదని తెలిపారు. అయితే, పార్టీ ఏ బాధ్యత అప్పజెప్పినా నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కర్ణాటకలోని ముళబాగిలు తాలూకా కురుడుమలై గ్రామంలో వినాయక ఆలయంలో పూజలు నిర్వహించడానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు.