: మోదీ చెవిలో ములాయం చెప్పింది ఇదేనట!
ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేసిన నాటి సమయంలో వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ములాయంను ప్రధాని మోదీ పలకరించగా... ఆయన దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెప్పారు ములాయం. దీంతో, మోదీకి ములాయం ఏం చెప్పారా? అంటూ ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసుకున్నారు. అయితే మోదీ చెవిలో ములాయం ఏం చెప్పారో ఆయన కుమారుడు అఖిలేష్ సింగ్ యాదవ్ బయటపెట్టారు.
'కొంచెం చూసుకోండి... ఇతను నా కుమారుడు అఖిలేష్' అని చెప్పారని అఖిలేష్ తెలిపారు. మీరు నమ్మకపోయినా ఇది నిజమని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అఖిలేష్ తెలిపారు. బీజేపీ చేసిన తప్పుడు ప్రచారం వల్లే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోయామని అఖిలేష్ అన్నారు.