: అమెరికాలో హత్యకు గురైన మరోభారతీయుడు


అమెరికాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. అమెరికాలోని డెట్రాయిట్ లో కేరళకు చెందిన రమేష్ కుమార్ వైద్యుడిగా పని చేస్తున్నారు. గత రెండురోజులుగా ఆయన ఫోన్ కు ఎంత ప్రయత్నించినా దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు, డెట్రాయిట్ లోని  ఒక రోడ్డు పక్కన నిలిపిఉన్న కారులో ఆయన మృతదేహం లభ్యమైంది. కారులో కూర్చుని ఉండగా ఆయనపై తుపాకీ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇది జాత్యహంకార దాడి కాదని తెలిపారు. దీని వెనుక కారణాలు వెలికితీస్తున్నామని పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News