: ఐపీఎల్ కు దూరమైన బ్రెండన్ మెక్ కల్లమ్
విధ్వంసకర బ్యాట్స్ మెన్, గుజరాత్ లయన్స్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ సందర్భంగా మెక్ కల్లమ్ గాయపడ్డాడు. ఎడమకాలి తొడ నరం నొప్పి తీవ్రంగా ఉండటంతో ఈ ఈవెంట్ కు దూరమయ్యాడు. ఈ సీజన్ లో గుజరాత్ లయన్స్ ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే, వరుస వైఫల్యాలతో ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలను ఈ జట్టు కోల్పోయింది. 11 మ్యాచ్ లు ఆడిన గుజరాత్ కేవలం మూడింటిలోనే గెలుపొందింది. మరోవైపు గాయాల కారణంగా ఇప్పటికే డ్వేన్ బ్రావో, ఆండ్రూ టైలు ఈ సీజన్ కు దూరమయ్యారు.