: ఆ పట్టుదలతోనే భాష నేర్చుకున్నాను!: రకుల్ ప్రీత్ సింగ్
మహేష్ బాబుతో స్పైడర్ సినిమాలో నటిస్తూ గలగలా మాట్లాడేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ను 'తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు... ఎలా నేర్చుకున్నారు?' అంటూ ప్రశ్నించగా నవ్వుతూ సమాధానమిచ్చింది. తెలుగు సినీ పరిశ్రమ తనను ఆదరించిందని, మంచి విజయాలతో మంచి గుర్తింపును, స్టార్ హోదాను ఇచ్చిందని, ఇన్ని ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమకు ఏమివ్వగలనని ఆలోచించి, తెలుగు నేర్చుకోవడమే ఉత్తమమని నిర్ణయించుకున్నానని చెప్పింది.
తన సపోర్టింగ్ స్టాఫ్ తో పాటు, షూటింగ్ లో యూనిట్ సభ్యులతో తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసేదానిని, దీంతో తెలుగు వేగంగానే వచ్చేసిందని, కేవలం ఆరు నెలల్లో తెలుగు భాషపై పట్టుసంపాదించుకున్నానని తెలిపింది. ఇండస్ట్రీపై ప్రేమతో భాషను నేర్చుకున్నప్పటికీ అది తనకు ఎంతో మేలు చేసిందని తెలిపింది. కథ, పాత్రలను బాగా అర్థం చేసుకుని, మరింత బాగా నటించేందుకు భాష ఉపయోగపడుతుందని తెలిపింది.