: రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడు?
మన దేశంలో రాష్ట్రపతి ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎన్డీయే, యూపీఏ పక్షాలు తమ అభ్యర్థి ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఇప్పటికే పలువురి పేర్లు రాష్ట్రపతి అభ్యర్థిగా వినిపించాయి. తాజాగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి పేరు కూడా తెరపైకి వచ్చింది. బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన వెంకయ్య... గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. దక్షిణాదిలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి వెంకయ్య అభ్యర్థిత్వం అనుకూలంగా పనిచేయవచ్చని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ రేసులో జార్ఖండ్ గవర్నర్ ద్రౌపతి ముర్ము, లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, మరో కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ లు ఉన్నారు.