: భారత్ పై పాకిస్థాన్ అప్రకటిత యుద్ధం చేస్తోంది... 50 తలలు తీసుకురండి: ప్రవీణ్ తొగాడియా
భారత్ పై పాకిస్థాన్ అప్రకటిత యుద్ధం చేస్తోందని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) చీఫ్ ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు. తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ సైన్యం కేవలం ఇద్దరు సైనికుల తలలు మాత్రమే నరికి తీసుకెళ్లలేదని, 120 కోట్ల మంది భారతీయులకు సవాల్ విసురుతోందని చెప్పారు. దుస్సాహసానికి ఒడిగట్టిన పాకిస్థాన్ కు తీవ్ర హెచ్చరికలు పంపే విధంగా ఇండియన్ ఆర్మీ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కు చెందిన 50 మంది సైనికుల తలలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు కానీ పాకిస్థాన్ కు బుద్ధి రాదని ఆయన అభిప్రాయపడ్డారు.