: ట్రంప్ తొలి విదేశీ పర్యటన ముస్లిం దేశంలోనే!


 అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఐదు ముస్లిం దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులపై చర్యల పేరిట ఆయన పలు దేశాలను నిషేధించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలి విదేశీ పర్యటనకు ఆయన సిద్ధమవుతున్నారు. మూడు దేశాల్లో వరుసగా పర్యటించనున్న ఆయన మొట్టమొదట కాలు పెట్టేది మాత్రం ముస్లిం దేశమైన సౌదీఅరేబియాలో కావడం విశేషం. అనంతరం ఇజ్రాయిల్, అక్కడి నుంచి వాటికన్‌ సీటీకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ తెలిపింది. ఈ సందర్భంగా...అధ్యక్షుడు ట్రంప్ ముస్లిం దేశాలతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నారని తెలిపారు.

 సౌదీ పర్యటన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు సల్మాన్‌ తో, ట్రంప్ సమావేశమై ఉగ్రవాద నిర్మూలనపై చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సౌదీ పర్యటనను ఆయన ముందుగా ఎంచుకోవడం వెనుక ఉద్దేశం.. ముస్లింలకు పవిత్రమైన రెండు పుణ్యక్షేత్రాలు ఉండడమేనని వారు పేర్కొన్నారు. అంతే కాకుండా, తాను కేవలం ఉగ్రవాదానికే తప్ప, ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రపంచానికి చాటిచెప్పడమని వారు తెలిపారు. ఇజ్రాయిల్ యూదులతో పాటు, క్రైస్తవులకు కూడా పుణ్యక్షేత్రమని, అలాగే రోమన్ క్యాథలిక్కులకు వాటికన్ సిటీ పవిత్రి స్థలమని తెలిసిందే. 

  • Loading...

More Telugu News