: లైంగిక వేధింపులపై ఫిర్యాదు కోసం త్వరలో ఈ-ప్లాట్‌ఫాం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే!
పని ప్రదేశంలో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న లైగింక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు మహిళా మంత్రిత్వ శాఖ కొత్తగా ఈ-ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నెలలోనే దీనిని ప్రారంభించాలని నిర్ణయించింది. ఇది అందుబాటులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న వేధింపులపై ఆన్‌లైన్‌లో నేరుగా ఫిర్యాదు చేసే వీలుంటుంది. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నామని, లైంగిక వేధింపులపై మహిళా ఉద్యోగులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని మహిళా శిశుసంక్షేమ మంత్రి మేనకా గాంధీ తెలిపారు.