: ఢిల్లీ అమ్మాయిలకు కరాటే నేర్పించండి.. ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు!
ఆత్మరక్షణ కోసం ఢిల్లీ అమ్మాయిలకు కరాటే నేర్పించాలని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అత్యాచారాల కేసును విచారిస్తున్న కోర్టు మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి చెబుతూ అమ్మాయిలకు కరాటే నేర్పించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై స్పందించిన ఢిల్లీ సర్కారు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు త్వరలోనే కరాటే శిక్షణ తరగతులు నిర్వహిస్తామని కోర్టుకు తెలిపింది. 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన తర్వాత అమ్మయిలకు ఢిల్లీ అంత సురక్షిత నగరం కాదని తేలింది. ఏటికేడు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయని జాతీయ నేర రికార్డుల సంస్థ అధ్యయనంలో తేలింది.