: ఏపీ హోం శాఖ సలహాదారుగా రిటైర్డ్ ఐపీఎస్ దుర్గాప్రసాద్ నియామకం


ఏపీ హోం శాఖ సలహాదారుగా రిటైర్డ్ ఐపీఎస్ కోడే దుర్గాప్రసాద్ ను నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కి చెందిన దుర్గాప్రసాద్ 1981 బ్యాచ్ ఐపీఎస్ కేడర్ కు చెందిన అధికారి. 2011 నవంబర్‌లో ఎస్‌పీజీ చీఫ్‌గా పదోన్నతి పొందారు. గతంలో విశాఖపట్టణం పోలీస్ కమిషనర్ గా, ఏపీ ట్రాన్స్ కో మేనేజింగ్ డైరెక్టర్ గా, గ్రేహౌండ్స్ చీఫ్ గా, అడిషినల్ డైరెక్టర్ జనరల్ గా పలు బాధ్యతలు నిర్వహించిన ఆయన, కొంత కాలం పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గానూ పనిచేశారు. తాజాగా ఏపీ హోం శాఖ సలహాదారుగా నియమితులైన దుర్గాప్రసాద్, మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ప్రణాళిక అమలుపై సలహాలు ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News