: టీ సర్కార్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి


తెలంగాణ ప్ర‌భుత్వంపై గవర్నర్  నరసింహన్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ రోజు నల్లగొండకు వెళ్లిన నరసింహన్ జిల్లా ఆస్పత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా  ఆస్పత్రిలో సౌకర్యాలు సరిగా లేవని కోమటిరెడ్డి గవర్నర్ దృష్టికి తెచ్చారు. మూడేళ్లుగా జిల్లా ఆస్పత్రిలో నిర్లక్ష్యం, వైద్యుల కొరత ఉందని  చెప్పారు. ఈ విషయమై అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని నరసింహన్‌తో కోమటిరెడ్డి ఫిర్యాదు చేశారు. కాగా, నల్గొండ పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీ యూనివర్శిటీ ప్రథమ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News