: ‘పెళ్లి చూపులు’ చిత్ర బృందాన్ని అభినందించిన కేసీఆర్
64వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కేటగిరీల్లో రెండు అవార్డులను ‘పెళ్లి చూపులు’ చిత్రం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పెళ్లి చూపులు’ చిత్ర బృందం సీఎం కేసీఆర్ ను ఈ రోజు కలిసింది. హైదరాబాద్ ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలిసి తమకు లభించిన అవార్డులను ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని అభినందించారు. భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. కేసీఆర్ ను కలిసిన వారిలో చిత్ర దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్, తదితరులు ఉన్నారు.