: హైదరాబాద్ కోఠి మెటర్నిటీ ఆసుపత్రిలో మరో దారుణం


హైద‌రాబాద్‌లోని కోఠి మెట‌ర్నిటీ ఆసుప‌త్రికి వెళ్లాలంటేనే మ‌హిళ‌లు బెంబేలెత్తిపోతున్నారు. అక్క‌డి సిబ్బంది తీరుతో ఇప్ప‌టికే ఆ ఆసుప‌త్రిలో ఎంతో మంది గ‌ర్భిణీలు మృత్యువాత ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఎప్పటికప్పుడు అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ, అటువంటి ఘ‌ట‌న‌లే రిపీట్ అవుతున్నాయి. ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యంతో ఈ రోజు ముగ్గురు మ‌హిళ‌లు ప్రాణాపాయ స్థితిలో ప‌డ్డారు. వైద్యం కోసం ఆసుప‌త్రికి వ‌చ్చిన వారికి ఫంగ‌స్‌తో ఉన్న‌ సెలైన్ బాటిళ్లు ఎక్కించ‌డంతో ముగ్గురు మ‌హిళ‌లు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో వారిని ఉస్మానియా ఆసుప‌త్రికి తర‌లించారు. బాధిత మ‌హిళ‌ల‌ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఉన్న‌తాధికారులు ఫ్రెసినీయ‌స్ పేరుగ‌ల సెలైన్ వాడ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News