: ఉత్తరకొరియా మరో ప్రయోగం చేస్తే వేలాది మంది ప్రజలు మరణిస్తారు: చైనా ఆందోళన


ఇప్ప‌టికే ప‌లు అణ్వాయుధ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన ఉత్త‌ర‌కొరియా ఎన్ని దేశాలు హెచ్చ‌రిస్తోన్నా ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా మ‌రో భారీ అణ్వస్త్ర ప్రయోగానికి సిద్ధమైన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్త‌ర‌కొరియా దుందుడుకు చ‌ర్య‌ల‌పై చైనా మ‌రోసారి స్పందిస్తూ తీవ్ర ఆందోళ‌న వ్యక్తం చేసింది. ఉత్త‌రకొరియా చేయాల‌ని చూస్తోన్న మ‌రో ప్ర‌యోగం కార‌ణంగా సరిహద్దు ప్రాంతంలో వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తే ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించింది. ఉత్త‌ర‌కొరియా ప్రయోగించనున్న ఈ అణ్వస్త్ర ప్రయోగ కారణంగా కొరియా, చైనా సరిహద్దులోని మౌంట్‌ పేంక్తూ అగ్ని పర్వతం బద్దల‌య్యే అవ‌కాశం ఉంద‌ని, దీంతో వేలాది మంది ప్రజలు మరణిస్తారని అభిప్రాయపడింది.

చైనా భాషలో చాంగ్‌బైషాన్‌గా పిలిచే, ఈ అగ్నిప‌ర్వ‌తం ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించే పుంగి–రీ ప్రాంతానికి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ అగ్నిప‌ర్వతానికి వంద కిలోమీటర్ల పరిధిలోనే ఇరు దేశాలకు చెందిన సుమారు 16 లక్షల మంది ప్రజలు నివ‌సిస్తున్నారు. ఉత్త‌ర‌కొరియా యాభై నుంచి వంద కిలో టన్నుల అణ్వస్త్రాన్ని ప్రయోగించనుంద‌ని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ అణ్వస్త్రంతో అగ్నిపర్వతం బద్దలయ్యే అవ‌కాశం ఉంద‌ని రాండ్‌ కార్పొరేషన్‌ను చెందిన డిఫెన్స్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News