: వైసీపీ ప్లీనరీ వేదిక, తేదీలు ఖరారు
వైసీపీ ప్లీనరీ సమావేశాలకు ఈసారి విజయవాడ వేదిక కానుంది. జూలై 8, 9 తేదీల్లో ఈ ప్లీనరీ జరగనుంది. ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ వివరాలను వెల్లడించారు. హైదరాబాదులోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జూన్ 19, 20, 21 తేదీల్లో జిల్లా స్థాయిలో ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. మే చివరి వారంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు, రెండో దశలో జిల్లా స్థాయిలో సమావేశాలు జరుగుతాయని తెలిపారు. దీనికి తోడు, హైదరాబాదులో తెలంగాణ జిల్లాల విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతాయని చెప్పారు.