: నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసిన జీశాట్-9


అంత‌రిక్షంలో ఘ‌న విజ‌యాలు సాధిస్తూ దూసుకుపోతున్న ఇస్రో ఈ రోజు జీశాట్‌-9 ఉపగ్రహ ప్ర‌యోగాన్ని చేబట్టింది. జీఎస్ఎల్వీ-ఎఫ్‌09 ఈ ఉప‌గ్ర‌హాన్ని నిప్పులు చిమ్ముతూ ఆకాశానికి మెసుకెళ్తోంది. ఇస్రో అధికారులు ఈ రాకెట్ ప్ర‌యోగ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఈ ప్ర‌యోగం పూర్త‌యిన త‌రువాత ఇందుకు సంబంధించిన అన్ని వివ‌రాలు తెలిపే అవ‌కాశం ఉంది. ప్ర‌ధాని మోదీ సూచ‌న మేర‌కు పాకిస్థాన్ మిన‌హా సార్క్ దేశాల స‌మాచార వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఇస్రో ఈ ఉప‌గ్ర‌హాన్ని నెల్లూరు జిల్లా షార్ నుంచి ప్ర‌యోగించింది. దక్షిణాసియా దేశాలకు భారత్ ఈ ఉపగ్రహాన్ని కానుకగా ఇస్తోంది. అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే.

  • Loading...

More Telugu News