: బాయ్ ఫ్రెండ్ తో మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం షర్మిలకు పెళ్లి!


మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం షర్మిల త్వరలో పెళ్లి చేసుకోనుంది. తన బాయ్ ఫ్రెండ్, బ్రిటిష్ పౌరుడు డెస్మండ్ కొటిన్హోను వివాహం చేసుకోనుంది. ఈ విషయాన్ని షర్మిల, డెస్మండ్ లిద్దరూ ధ్రువీకరించారు. అయితే, పెళ్లి తేదీ మాత్రం ఇంకా నిర్ణయించలేదు. కాగా, ఈ జంట ప్రస్తుతం తమిళనాడులోని మధురైలో ఉన్నారు. అనుమతులు లభించాక తామిద్దరం ఇక్కడే పెళ్లి చేసుకుంటామని డెస్మండ్ తెలిపారు. షర్మిల తీసుకున్న నిర్ణయంపై ఆమె సోదరుడు ఇరోం సంఘాజిత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇరోం షర్మిల పదహారేళ్ల పాటు దీక్ష చేసిన విషయం విదితమే. దీక్ష చేస్తున్న సమయంలో ఆమెకు బ్రిటిష్ పౌరుడు డెస్మండ్ కొటిన్హో పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇదిలా ఉండగా, దీక్ష విరమించిన అనంతరం, ఇరోం షర్మిల రాజకీయాల్లోకి రావడం, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం విదితమే. ఎన్నికల్లో తాను ఓడిపోతే కనుక పెళ్లి చేసుకుంటానని నాడు ఆమె చెప్పిన మాట ప్రకారం, తన బాయ్ ఫ్రెండ్ తో వివాహానికి సిద్ధమయ్యారు.

  • Loading...

More Telugu News