: హిందీ సినిమాకు పాట రాస్తానని అనుకోలేదు: తెలుగు పాటల రచయిత సిరాశ్రీ
బాలీవుడ్ సినిమాకు టాలీవుడ్ సినీ గేయ రచయిత తొలిసారిగా పాట రాశారు. ఈ అరుదైన అవకాశాన్ని పొందిన రచయిత సిరాశ్రీ అని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తన ట్విట్టర్ ఖాతా లో తెలిపారు. ‘సర్కార్-3’ చిత్రంలోని ‘థాంబా..’ అంటూ సాగే పాటను సిరాశ్రీ రాసినట్టు వర్మ పేర్కొన్నారు. అయితే, ఈ ట్వీట్ కు స్పందించిన సిరాశ్రీ.. వర్మకు ట్రిలియన్ థ్యాంక్స్, అమితాబ్ బచ్చన్ కు జిలియన్ శాల్యూట్స్ అని, హిందీలో పాట రాస్తానని తాను కలలో కూడా అనుకోలేదని, అది కూడా ‘సర్కార్-3’ వంటి సినిమాకు పాట రాయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఏళ్ల తరబడి తాను చూసిన హిందీ సినిమాలు, విన్న హిందీ పాటలు, కాలేజీ రోజుల్లో ఎన్ సిసి క్యాంపుల వల్ల నేర్చుకున్న కొంచెం హిందీ... వీటితో పాటు రామ్ గోపాల్ వర్మతో సాహచర్యం వల్ల పెరిగిన హిందీ మిత్రులు.. ఇలా.. తాను హిందీ పాట రాసేందుకు కలిసొచ్చాయని పేర్కొన్నారు.