: 'దంగల్' రికార్డ్.. చైనాలో 9 వేల థియేటర్లలో విడుదల
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమా ఈరోజు చైనాలో భారీ ఎత్తున విడుదలైంది. సుమారు 9000 థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాతలు వెల్లడించారు. విదేశీగడ్డపై ఓ భారతీయ చిత్రం ఇన్ని థియేటర్లలో విడుదల కావడం ఇదే ప్రథమం. చైనాలో మొత్తంమీద 40 వేల థియేటర్లు ఉన్నాయి. అంటే, దేశంలో ఉన్న 25శాతం థియేటర్లలో దంగల్ విడుదలైందన్నమాట. గత నెలలో ఈ సినిమాను బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు.