: దోషులకు ఉరిశిక్షపై నిర్భయ తల్లిదండ్రుల హర్షం


‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులు ముఖేశ్, వినయ్, అక్షయ్, పవన్ లకు కింది కోర్టులు విధించిన ఉరిశిక్షనే సుప్రీంకోర్టు ఖరారు చేయడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తీర్పు వెలువరిస్తున్న సమయంలో కోర్టులోనే ఉన్న నిర్భయ తల్లిదండ్రులు చప్పట్లు కొడుతూ తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో తమకు న్యాయం జరిగిందని నిర్భయ తల్లిదండ్రులు, ఆమె తరపు న్యాయవాదులు అన్నారు.

కాగా, 2012, డిసెంబర్ 16లో ఢిల్లీలో కదిలే బస్సులో వైద్య విద్యార్థిని నిర్భయపై ఆరుగురు దుండగులు కిరాతకానికి పాల్పడ్డారు. ఆరుగురు నిందితులలో ఒకరు శిక్ష అనుభవిస్తూ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో ఈ కేసు నుంచి బయట పడ్డాడు. ఇక, మిగిలిన నలుగురికి కింది కోర్టులు మరణశిక్ష ఖరారు చేశాయి. ఈ తీర్పును సవాల్ చేస్తూ, నలుగురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అదే శిక్షను ఖరారు చేసింది.

  • Loading...

More Telugu News