: ఒక్కో తలకు ప్ర‌తీకారంగా ముగ్గురు పాకిస్థానీయుల తలలు నరకాలి: పంజాబ్ ముఖ్యమంత్రి


భార‌త్‌-పాకిస్థాన్ స‌రిహ‌ద్దు వ‌ద్ద ఇద్ద‌రు భార‌త జవానులను చంపి, వారి త‌ల‌లు న‌రికిన పాక్ రేంజ‌ర్ల దుశ్చ‌ర్య‌పై భారత్ యావ‌త్తు మండిప‌డుతోంది. ఈ అంశంపై ప్ర‌తీకారం తీర్చుకోవాల్సిందేన‌ని దేశంలోని ప్ర‌ముఖులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ ఈ అంశంపై స్పందిస్తూ ఒక్కో భారతీయ సైనికుడి తలకు ప్ర‌తీకారంగా ముగ్గురు పాకిస్థానీయుల తలలు నరకాలని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భారత సైనికులను పాక్ కిరాతకంగా హత్య చేయడాన్ని మాజీ సైనికుడిగా తాను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. మన సైనికులను ఏ విధంగా చంపారో అదే విధంగా మనవాళ్లు కూడా పాక్ రేంజర్లను చంపాలని ఆయ‌న అన్నారు. ఇటీవలి కాలంలో నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద‌ చోటుచేసుకున్న పరిణామాలు ఆమోదయోగ్యం కాదని, పాకిస్థాన్ దుశ్చర్యలను కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోరాదని హెచ్చ‌రించారు.

  • Loading...

More Telugu News