: డ్రైవర్ నిద్రమత్తు కారణంగా పెళ్లింట విషాదం...14 మంది మృతి


డ్రైవర్ నిద్రమత్తు కారణంగా పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఈటా జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున పెళ్లి వేడుకలకు వెళ్లి వస్తున్న ఓ మినీ వ్యాను బోల్తాప‌డింది. దీంతో 14 మంది ప్రాణాలు కోల్పోగా, మ‌రో 28 మందికి గాయాలయ్యాయి. ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి, ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆ మినీవ్యాను రోడ్డు పక్కన రెయిలింగ్‌ను దాటుకుని వెళ్లి ఓ మురుగు కాలువలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. 

  • Loading...

More Telugu News