: పావని, శ్రావణ్, పార్టీలో ఉన్న మరో ఆరుగురికి పోలీసుల నోటీసులు
నటుడు ప్రదీప్ ఆత్మహత్య వెనకున్న అసలు కారణాన్ని వెలుగులోకి తెచ్చే దిశగా విచారణ వేగవంతం చేసిన హైదరాబాద్ పోలీసులు, ఆయన భార్య పావని, ఆమె స్నేహితుడు శ్రావణ్ సహా మరో ఆరుగురిని విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపారు. శ్రావణ్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న అందరినీ విచారించాలని నిర్ణయించుకున్న పోలీసులు, వారిని ఈ సాయంత్రం ప్రశ్నించనున్నారు. తొలుత శ్రావణ్ ను, పావనిని లోతుగా విచారిస్తారు. ఈ కేసులో ప్రదీప్ ది ఆత్మహత్యేనని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేయడంతో, అందుకు దారితీసిన కారణాల అన్వేషణే లక్ష్యంగా విచారణ సాగనుంది. కాగా, అందరి విచారణ నేటితో ముగుస్తుందని, మరేవైనా అనుమానాలుంటే, రేపు కూడా విచారించే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.