: వెంకన్న సేవలో ముఖేష్ అంబానీ
తిరుమల వెంకన్నను ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నిజపాద దర్శన సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు దర్శనం చేసుకున్నారు. మరోవైపు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుమారుడు ఆకాష్ అంబానీలు అభిషేక సేవ సమయంలో వెంకన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం చేయించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.