: చిరంజీవి ఉత్తరాంధ్ర రికార్డును ఆరు రోజుల్లో తిరగరాసిన 'బాహుబలి'
సుమారు పదేళ్ల తరువాత 'ఖైదీ నెంబర్ 150'తో వచ్చిన చిరంజీవి, తనకు మంచి పట్టు, అసంఖ్యాక అభిమానులు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో బాహుబలి-1 కలెక్షన్ల రికార్డును తిరగరాసి తన స్టామినా ఎంతమాత్రమూ తగ్గలేదని నిరూపించగా, గత వారంలో విడుదలైన 'బాహుబలి-2' ఆరంటే ఆరు రోజుల్లో ఆ రికార్డును తిరగరాసింది. ఉత్తరాంధ్రలో 'ఖైదీ నంబర్ 150' రూ. 10 కోట్ల షేర్ సాధించగా, 'బాహుబలి-2' ఇప్పటికే రూ. 14 కోట్ల షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లలో తొలుత లాభాల్లోకి వచ్చింది ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లేనని సమాచారం. ఇక ఫుల్ రన్ లో ఈ సినిమా రూ. 25 కోట్ల వరకూ కలెక్షన్లను వసూలు చేస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.