: మంత్రి పదవి కావాలని ఎన్నడూ కోరలేదు: నారా లోకేష్
రెండు రోజుల విశాఖ పర్యటనకు వచ్చిన ఏపీ మంత్రి నారా లోకేష్, ఈ మధ్యాహ్నం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనకాపల్లిలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ, మంత్రి పదవి కావాలని తానెప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు. మంత్రిని కావాలన్న కోరిక తనకు లేదని, తెలుగుదేశం పార్టీ పెద్దల ఒత్తిడి, కార్యకర్తల ఆకాంక్ష మేరకే తాను మంత్రినయ్యానని తెలిపారు. పల్లెటూర్లకు సేవ చేస్తే పరమాత్మకు సేవ చేసినట్టేనని, అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు కట్టుబడి వున్నానని అన్నారు. కింది స్థాయి నేతలకు తగిన ప్రోత్సాహం అందిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.